Minister KTR: 'గిరిజనుల అభివృద్ధి దేశానికి గర్వకారణం' - hyderabad ambedkar jayathi celebrations
🎬 Watch Now: Feature Video
Minister KTR at Ambedkar Jayanthi Celebrations : హైదరాబాద్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాఠోడ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గిరిజన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీ ప్రైడ్ను ప్రారంభించామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులు బాగుపడితే అది దేశానికి గర్వకారణం అని అన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే తెగింపు ఉండాలని.. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. అందుకే దళితబంధు లాంటి పథకాలు తీసుకువచ్చారని.. ఇలాంటి పథకాలు ఏ రాజకీయ నేతలూ చేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ మారుమూల గ్రామంలో చూసినా ఎకరం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు పలుకుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. మంచి చేసే నాయకులను ప్రజలు ఎప్పుడూ కాపాడుకుంటారని.. ఆ విశ్వాసం తమకు ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.