Minister KTR on Hyderabad City Development : 'హైదరాబాద్‌ నగరం మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధించింది' - మంత్రి కేటీఆర్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 3:32 PM IST

Minister KTR on Hyderabad City Development : వందేళ్ల ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అవతరించిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎక్స్​(ట్విటర్)లో వెల్లడించారు. హైదరాబాద్ రహదారి వ్యవస్థలో మార్పులు, మెట్రో రైలు, మౌళిక వసతుల ఏర్పాటు, ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం, హరిత హారం.. ఇలా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చేపట్టిన కార్యక్రమాలు ఎన్నో భాగ్యనగరంలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ నగరం మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

KTR on Hyderabad Development : అలాగే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు బాగుంటేనే అందరం సుభిక్షంగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. పొట్టకూటి కోసం ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారని.. అందరికీ ఉపాధి లభించేలా హైదరాబాద్‌లో పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.