'కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే - కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కుమారుడు పుట్టినట్టే' - బీఆర్ఎస్ఎ ఎన్నికల ప్రచారం 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 3:30 PM IST
Minister KTR Election Campaign at Bhiknoor : కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారంటే.. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కుమారుడు పుట్టినట్టే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో కలిసి.. బిక్కనూరులో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ భూ కబ్జాలు చేసేందుకు వస్తున్నారని వచ్చిన వ్యాఖ్యాలను తిప్పికొట్టిన ఆయన.. ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికిపోదని హామీ ఇచ్చారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములన్నింటికీ పట్టాలిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డిలో కచ్చితంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరి మీరు కూడా కచ్చితంగా బీఆర్ఎస్కు ఓట్లేస్తారా అని ప్రజల్ని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే హామీలకు, ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. కామారెడ్డి బాగుపడాలంటే, పొలాలకు నీళ్లు కావాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.