ఖరీఫ్ పంట చివరి తడికి నీళ్లు అందించాలి - అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం - Minister Jupalli ordered officials
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 3:47 PM IST
Minister Jupally Krishna Rao Visit Ramanpadu Dam : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి ఖరీఫ్ పంట చివరి తడికి నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామన్ పాడ్ జలాశయం నుంచి విడుదల చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంటకు సరిపడా నీరులేక పంటలు ఎండిపోతున్నాయని, కనీసం చివరి తడికైనా నీటిని విడుదల చేయాలని పలువురు రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు రామన్ పాడ్ ప్రాజెక్ట్ను సందర్శించి జలాశయంలో నీటి లభ్యతపై నీటి పారుదల శాఖ ఎస్ఈ సత్యశీల రెడ్డితో ఆరా తీశారు. వేసవిలో తాగు నీటికి ఇబ్బందులు లేకుండా పంట చివరి తడికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
RamanPadu Reservoir water For Kharif Crop : జూరాల నుంచి రామన్ పాడ్ పాల్ దిన్నె వరకు అమరచింత, ఆత్మకూర్, మదనాపురం కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు లెప్ట్ కెనాల్ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సమకూరుతుంది. బీమా ఎత్తిపోతల పథకం ద్వారా కొత్తకోట, శ్రీరంగపురం, వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు సమకూరుతుంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్ట్ లో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో ఖరీఫ్ పంట చివరి తడికి నీటిని విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.