Minister Jagadish Reddy Visit Shirdi Temple : షిర్డీసాయిని దర్శించుకున్న మంత్రి జగదీశ్​రెడ్డి.. - Jagadish Reddy visit to Shirdi

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 4:26 PM IST

Minister Jagadish Reddy Visit Shirdi Temple : రాష్ట్ర విద్యుత్​శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​.. కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేళ.. బాబా ఆశీర్వాదం కోసం షిర్డీకి వచ్చినట్లు పేర్కొన్నారు. షిర్డీలో సౌకర్యాలు బాగున్నాయని కితాబిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ ​పార్టీ​ హ్యాట్రిక్​ విజయం సాధించాలని, బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 

Tungathurthy MLA Gadari Kishore Visit Shirdi : గతంలో కంటే ఈసారి ఎలక్షన్లలో.. బీఆర్​ఎస్​ పార్టీ మరిన్నీ సీట్లను కైవసం చేసుకుంటుందని మంత్రి జగదీశ్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్​ అన్ని నియోజకవర్గ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ​ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్​లో మాత్రం సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ మరోసారి అధికారంలోకి ఖాయమన్నారు. ఒక కుటుంబ పెద్దగా ఆలోచించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందించారన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.