'ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే బాధేస్తోంది - హ్యాట్రిక్ విజయంపై పూర్తి విశ్వాసం ఉంది'
🎬 Watch Now: Feature Video
Published : Nov 21, 2023, 6:48 AM IST
Minister Indrakaran Reddy Interview : కర్ణాటక ఫలితాల తర్వాత బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యర్థిగా కనిపిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తాను పోటీ చేస్తున్న నిర్మల్‌లో మాత్రం బీజేపీనే ప్రత్యర్థిగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ప్రతిరోజు బాధ కలుగుతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మేలు కలిగేలా ఎన్నో సంక్షేమ పథకాలవుతున్నా... ఇంకా ఏదో కావాలనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావుతో తనకు ఎలాంటి ఇబ్బందీలేదని.. ఆయనకు రాజకీయాల్లో ఎన్నో పదవులు తాను ఇప్పించినా.. ఇప్పుడు ఆయన తనకు ప్రత్యర్థిగా మారారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సారథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో తాను ముచ్చటగా మూడోసారి విజయం సాధించటం తథ్యమని జోస్యం చెప్పారు. తనకు మరో ఛాన్స్ ఇస్తే.. నిర్మల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమాతో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖీ.