Minister Indrakaran Dance in Ganesh Nimajjanam : గణేశ్ నిమజ్జనోత్సవంలో తీన్మార్ డప్పులకు.. స్టెప్పులేసిన మంత్రి ఇంద్రకరణ్ - Minister Indrakaran dances to the drums of Tinmar
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2023, 7:42 PM IST
Minister Indrakaran Dance in Ganesh Nimajjanam : బొజ్జ గణపయ్య పూజలకు నేటితో 11 రోజులు ముగియనుండడంతో.. రాష్ట్రమంతటా గణనాథుని నిమజ్జన వేడుకలకు భక్తకోటి సిద్ధమైంది. ఈ తరుణంలోనే నిర్మల్ జిల్లా కేంద్రంలో వినాయకుని నిమజ్జన శోభాయాత్ర గురువారం మధ్యాహ్నం వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని బుధవార్‌పేట్ నంబర్ 1 గణేశ్ వద్ద రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. కార్యకర్తల కోరిక మేరకు కొద్దిసేపు మంత్రి ఇంద్రకరణ్ తీన్మార్ స్టెప్పులేసారు. వినాయకుణ్ని తీసుకెళ్లే ట్రాక్టర్‌ను కొద్దిసేపు తానే స్వయంగా నడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అదేవిధంగా ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నడుచుకోవాలని కోరారు. నిమజ్జనం చేసే వినాయక సాగర్ బంగల్పేట్ చెరువు వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Ganesh Nimajjanam in Adilabad : గణేశ్ ఉత్సవాల నిర్వహణలో హైదరాబాద్ తర్వాత స్థానాన్ని దక్కించుకున్న ఆదిలాబాద్‌లో బొజ్జ వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర కన్నులపండుగగా ప్రారంభమైంది. పట్టణంలోని వినాయక చౌక్ శిశుమందిర్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడికి ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్రలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు కోలాటం చేస్తు ముందుకు కదిలారు.