మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట - కమలాకర్‌కు హైకోర్టులో ఊరట
🎬 Watch Now: Feature Video
Published : Nov 8, 2023, 4:32 PM IST
|Updated : Nov 8, 2023, 4:41 PM IST
Minister Gangula Kamalakar got relief in the High Court : తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గంగుల ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంగుల కమలాకర్.. ఎన్నికల అఫిడవిట్లో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన పరిమితి కంటే.. ఎక్కువ ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రిజిస్ట్రీ ద్వారా హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి గంగుల కమలాకర్ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలు తెప్పించుకుంది.
నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. గంగుల కమలాకర్ ఎన్నికల అఫిడవిట్లో తప్పులున్నాయని భాజపా నేత బండి సంజయ్ ఆరోపించారు. ఆయన దాఖలు చేసిన పిటీషన్ పై కూడా ఇప్పటికే కోర్టులో వాదనలు ముగిశాయి. దీనికి సంబంధించిన తీర్పును హైకోర్టు వెలువరించాల్సి ఉంది.