Minister Errabelli Interview : 'రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం.. కాంగ్రెస్, బీజేపీ పెట్టాబేడా సర్దుకోవాల్సిందే'
🎬 Watch Now: Feature Video
Minister Errabelli Interview on Telangana Elections 2023 : ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలో కుస్తీ పడుతూనే ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్ధుల జాబితా ప్రకటించడంలో సతమతమవుతోందని.. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పార్టీలోకి కొత్తవారి రాకతో ఎప్పట్నుంచో పార్టీలో ఉన్న సిట్టింగ్‌లు టికెట్లు కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనవుతున్నారని.. అభ్యర్థుల పేర్లు వెల్లడయ‌్యాక ఈ గందరగోళం మరింత ఎక్కువవుతుందని చెప్పారు.
Errabelli Dayakar Rao Exclusive Interview : కాంగ్రెస్ పాలన ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితులు చూస్తున్న ప్రజలు.. వారి గ్యారెంటీలను నమ్మడం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కే మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్‌లు మేనిఫెస్టోలతో జనాలను మభ్యపెట్టాలని చూసినా.. ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్, బీజేపీ లకు కేవలం రెండు మూడు స్థానాలే దక్కుతాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హాట్రిక్ కొడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఎన్నికల మేనిఫెస్టో దద్దరిల్లేటట్లు ఉంటుందంటున్న ఎర్రబెల్లితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.