Minister Errabelli Election Contest With Baba Blessings : బాబా ఆశీస్సులతో ఘన విజయం సాధిస్తా.. షిర్డీ సందర్శనలో ఎర్రబెల్లి - తెలంగాణ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 31, 2023, 4:10 PM IST
Minister Errabelli Election Contest With Baba Blessings : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించాలని.. షిర్డీ సాయి బాబాను వేడుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ప్రతిసారీ ఎలక్షన్ ముందు బాబా ఆశీస్సులను పొందేందుకు షిర్డీకి కచ్చితంగా తాను వస్తున్నట్లు వివరించారు. ఈ ఆనవాయితోనే గత ఏడు పర్యాయాలు గెలవటం జరిగిందన్నారు. గెలిచాక మళ్లీ బాబాను దర్శించుకోవటం జరుగుతుందన్నారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయమని.. మెజార్టీ సీట్లు రావటం జరుగుతుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల సమరంలో తాను కూడా ఘన విజయం చెందాలని.. ఆ దేవుణ్ని మనసారా వేడుకున్నట్లు తెలిపారు. బాబా ఆశీస్సులు తోడై నిర్విఘ్నంగా జయకేతనం ఎగురవేయాలనే ఉద్దేశ్యంతో ఇవాళ దర్శించుకోవటం జరిగిందన్నారు. జాతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రంలో కూడా చాలా అద్భుతంగా రానించాలని.. కేవలం తెలుగువాళ్లే కాకుండా మరాఠా రైతులు సైతం గులాబీ పథకాలకు ముగ్ధులవటం జరిగిందన్నారు. భవిష్యత్లో మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్నారు.