Minister Botsa Satyanarayana Reaction On Chandrababu Skill Development Case: బంద్‌లు, ధర్నాలతో టీడీపీ నేతలు ఏం సందేశమిస్తున్నారు: మంత్రి బొత్స - మంత్రి బొత్స సత్యనారాయణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 9:28 PM IST

Minister Botsa Satyanarayana Reaction on Chandrababu Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇదే అశంపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ చంద్రబాబు అరెస్ట్​పై స్పందించారు.  చంద్రబాబు ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు.   అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతోనే అరెస్టు చేసినట్లు మంత్రి  బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు చిట్టా విప్పి అన్ని కుంభకోణాలు బయటపెడతామన్నారు. బంద్‌లు, ధర్నాలతో టీడీపీ నేతలు ఏం సందేశమిస్తారని మంత్రి  ప్రశ్నించారు. 

ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని.. అధికారులు పక్కాగా ఆధారాలతో నిరూపించారని మంత్రి వెల్లడించారు. న్యాయస్థానం రిమాండ్ విధిస్తే.. టీడీపీ శ్రేణులు  ధర్నాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెబినెట్ తీసుకున్న నిర్ణయం అయినా... స్కిల్ డెవలప్​మెంట్ కేసులో జరిగిన అక్రమాలకు చంద్రబాబు పూర్తిగా బాధ్యుడని బొత్స పేర్కొన్నారు.  రాజ్యాంగం, చట్టాలు అనేవి పకడ్బందీగా ఉంటాయని, ఎవ్వరినీ ఉపేక్షించబోవని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.