పోలింగ్ అనంతరం ఉద్రిక్తత - కాంగ్రెస్ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యర్థి దాడి - హైదరాబాద్ పొలిటికల్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Nov 30, 2023, 10:48 PM IST
MIM Candidate Ahmed Balala Attacked Congress Candidate : తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మలక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్‌పై ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్యే అహ్మద్ బలాల దాడి చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం సైదాబాద్‌లోని జాకీర్ హుస్సేన్ మైదానం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి తనపై దాడి చేశారని షేక్ అక్బర్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Clash between Congress and MIM : షేక్ అక్బర్‌పై దాడి జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. లాఠీ ఛార్జీ చేసి గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. ఎంఐఎం అహ్మద్ బలాల కిరాయి గుండా అక్బర్ .. మండి పడ్డారు. వారంతా కలిసి తనని చంపే ప్రయత్నం చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన వాపోయారు. ఇలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా తొలగించాలని అక్బర్ కోరారు. పోలీసులపై, ఈసీపై తనకు నమ్మకం ఉందని అక్బర్ అన్నారు.