మేడిగడ్డకు జలకళ.. బ్యారేజి గేట్లు ఎత్తివేత - Medigadda gates open video
🎬 Watch Now: Feature Video

కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాణహిత నది ఉద్ధృతితో ప్రవహిస్తోంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తోంది. బ్యారేజ్‌లో 85 గేట్లకు గాని 10 గేట్లను ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 17,320 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండగా 15,310 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను 9.635 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST
TAGGED:
Medigadda gates open video