Maternal Uncle Nephew Died In Ganesh Immersion Video : గణేశ్ నిమజ్జనంలో విషాదం.. నీట మునిగి మామాఅల్లుళ్లు మృతి - నీటిలో మునిగి మామ మేనల్లుడు మృతి
🎬 Watch Now: Feature Video
Published : Sep 24, 2023, 9:43 AM IST
|Updated : Sep 24, 2023, 10:18 AM IST
Maternal Uncle Nephew Died In Ganesh Immersion : గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో గణేశ్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. వినాయక ప్రతిమను నిమజ్జనం చేస్తూ మామ,మేనల్లుడు మృతి చెందారు. ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. రాజ్కోట్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన 8మంది కుటుంబసభ్యులు వినాయక నిమజ్జనం కోసం ఆజీ నదిపై ఉన్న డ్యామ్ వద్దకు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు నది మధ్యలోకి వెళ్లారు. అనంతరం పెద్ద గుంతలో ఇరుక్కున్నారు. దీంతో మామాఅల్లుళ్లు హర్ష గోస్వామీ-కేతన్ గోస్వామీ మృతి చెందారు. ఇంకో వ్యక్తి మాత్రం ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డ్యామ్ వద్దకు వచ్చారు. గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. శవపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.