బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. 100 షాపులకు మంటలు.. 20 ఫైరింజన్లతో.. - అసోంలో భారీ అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
అసోం జోర్హాట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చౌక్ బజార్లోని ఓ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో 100 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 20 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని.. ఇప్పుడే నష్టాన్ని అంచనా వేయలేమని ఎస్పీ తెలిపారు.