Massive Fire Accident at Lalithambika Shopping Complex in Srisailam: శ్రీశైలంలో ఘోర అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం - 15 shops burnt due to short circuit
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-08-2023/640-480-19396908-thumbnail-16x9-fire-accident-at-lalithambika-shopping-complex-in-srisailam.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Aug 31, 2023, 8:31 AM IST
Massive Fire Accident at Lalithambika Shopping Complex in Srisailam : శ్రీశైలంలోని లలితాంబికా దుకాణంలో బుధవారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరగడంతో 15 దుకాణాలు దగ్ధం అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని లలితాంబికా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్ సముదాయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా సుమారు 15 దుకాణాలు అగ్నిగి ఆహుతయ్యాయి. (15 Shops Were Burnt Down). మంటలు వ్యాపించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి హూటాహూటిన చేరుకొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు 2 కోట్ల రూపాయలు (Two Crore Property Loss) నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్ బ్లాకు దుకాణాల్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం