Mass Absence of Officials in Vikarabad MRO Office : ఎమ్మార్వో కార్యాలయంలో మూకుమ్మడిగా అధికారుల గైర్హాజరు.. కారణం అదే..? - Parigi Tehsildar Incident in Vikarabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 3:52 PM IST

Mass Absence of Officials in Vikarabad MRO Office : వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు మూకుమ్మడిగా గైర్హాజరైన ఘటన చోటుచేసుకుంది. దీంతో చాలా మంది రిజిస్ట్రేషన్‌ల కోసం వచ్చి ఎదురు చూస్తున్నారు. లక్ష్మీదేవిపల్లికి చెందిన 94, 95, 96 సర్వే నంబర్లలోని 14 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్​పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. దీంతో వివాదంలో ఉన్న భూమిని.. అగ్రిమెంటు చేయవద్దని అధికారులకు కోర్టు నోటీసులు పంపించింది.

నోటీసు పంపించినా వినకుండా గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మార్వో దానయ్య రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గ్రామస్థులకు.. అధికారులకు వాగ్వివాదం జరిగింది. ఈ కారణంగా తహసీల్దార్ కార్యాలయానికి ఎమ్మార్వో మొదలుకొని చిన్న స్థాయి అధికారుల వరకు గైర్హాజరైనట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రిజిస్ట్రేషన్​ల గురించి వచ్చి.. తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.