8 రకాల యుద్ధ విద్యల్లో రాణిస్తున్న కామారెడ్డి యువతి - ప్రోత్సాహం అందిస్తే ఆకాశమే హద్దు! - Martial Arts News in kamareddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2023, 1:52 PM IST

Martial Arts Champion Pratibha in kamareddy : ఆకాశంలో సగం మహిళలు అంటారు. కానీ క్రీడారంగంలో మహిళల సంఖ్య కాస్త తక్కువే ఉంటుంది. ప్రత్యేకించి యుద్ధ విద్యలు అయిన కరాటే, బాక్సింగ్ వంటి విద్యల్లోకి అమ్మాయిలు వెళ్లటానికి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి చూపరు. కానీ అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనూ ఇతరులకు తీసిపోమని పలు సందర్బాల్లో నిరూపించారు. ఎవరైనా ఒకటి రెండు క్రీడల్లో ఛాంపియన్లుగా ఉంటారు.. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రతిభ మాత్రం 8 రకాల యుద్ధ విద్యలు నేర్చుకుని పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

Martial Arts Champion : మిగతా క్రీడల్లాగే మార్షల్ ఆర్ట్స్​కు కూడా ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తే .. యువత ఆ రంగంలో అద్భుతాలు సాధించగలరని అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా.. సాధించాలనే పట్టుదలతో టోర్నమెంట్స్​లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తోంది ఈ యువతి. మార్షల్ ఆర్ట్స్​లో ఛాంపియన్​గా దూసుకెళ్లిపోతున్న ప్రతిభతో ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.