Manda Krishna Madiga on SC Classification : 'ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన పార్టీకే.. మా ఓటు' - Manda Krishna Comments on Political Parties
🎬 Watch Now: Feature Video
Published : Oct 29, 2023, 6:47 PM IST
Manda Krishna Madiga on SC Classification : నవంబర్ 30 లోపు ఏ పార్టీ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలుస్తుందో.. ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభల్లో చెప్పే మాటలు తమకు కడుపు నింపవని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని కలుపుకొని ప్రధాని మోదీ దగ్గరికి వెళ్లి ప్రస్తావించానని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆ అంశాన్ని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
Madiga Vishwarupa Sabha 2023 : కర్ణాటక మేనిఫెస్టోలో మొదటి అంశం ఎస్సీ వర్గీకరణ పెట్టారు.. ఇప్పటి వరకు ఆచరించిన దాఖలాలు లేవని మందకృష్ణ ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేంద్రంలోని ప్రధాన పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారే తప్ప.. ఆచరణలో పెట్టడం లేదని మండిపడ్డారు. డీకే శివకుమార్ కర్ణాటకలో హామీల అంశాల గురించి ఇక్కడ మాట్లాడటం సరి కాదన్నారు. అక్కడ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ(PM Modi), కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పలుమార్లు ఈ విషయం గురించి ప్రస్తావించామని అన్నారు. నవంబర్ 18న హైదరాబాదులో మాదిగ విశ్వరూప సభ(Madiga Vishwarupa Sabha) ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని వెల్లడించారు.