Man Swims in Flood to Restore Current : సలాం సంతోశ్.. భారీ వర్షంలో ఈదుకుంటూ వెళ్లి.. ఊరికి వెలుగులు అందించి..
🎬 Watch Now: Feature Video
Man Swims in Flood to Restore Current in Suryapet : భారీ వర్షానికి పోటెత్తుతున్న వరద.. నిండుకుండను తలపించే చెరువు.. అందులో నుంచి ఊరికి కరెంటు సరఫరా అయ్యే విద్యుత్ స్తంభాలు.. నిండిన తటాకంతో విద్యుత్ నిలిచిపోయిన స్థితిలో.... ఓ హెల్పర్ చేసిన సాహసం గ్రామస్థులతో సెల్యూట్ చేయించింది. సూర్యాపేట జిల్లా పాతర్లపహడ్ గ్రామంలో సంతోష్ అనే వ్యక్తి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. భారీ వర్షానికి గ్రామంలో చెరువు నిండిపోగా.. అప్పటికే ఊరికి కరెంటు నిలిచిపోయింది. చెరువులో నుంచి విద్యుత్ సరఫరా అయ్యే స్తంభాలు ఉండగా.. అదే ప్రాంతంలో మరమ్మతు తలెత్తింది. జంక్షన్ వద్ద నుంచి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేయించిన హెల్పర్ సంతోశ్.. వరదతో పూర్తిగా నిండిపోయిన చెరువులో నుంచి ఈదుకుంటూ వెళ్లాడు. భారీ వర్షం, చుట్టూ వరద ప్రవాహాన్ని లెక్కచేయకుండా స్తంభంపైకి ఎక్కి మరమ్మతు చేసి.. అప్పటికప్పుడు గ్రామానికి కరెంటు సరఫరా అయ్యేలా చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో హెల్పర్‌ను వెళ్లొద్దని గ్రామస్థులు వారించినా.. తాను చేసిన సాహసానికి తర్వాత వారంతా అభినందించారు.