వేడుకలో డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి.. ఛాతిలో నొప్పి వచ్చినా ఆగకుండా.. - ఉత్తర్‌ప్రదేశ్ డ్యాన్స్ మృతి
🎬 Watch Now: Feature Video
వివాహ వార్షికోత్సవంలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు ఓ వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. ఔషధాల డీలర్‌గా ఉన్న అమర్దీప్ వర్మ(46) బంధువుల వివాహ వార్షికోత్సవ వేడుకకు తన భార్యతో కలిసి వెళ్లాడు. బంధువులంతా ఆనందంగా డ్యాన్స్ చేస్తుండగా అమర్దీప్ సైతం కాలు కదిపాడు. కొద్దిసేపు డ్యాన్స్ చేసిన తర్వాత అతడికి ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే కాసేపు పక్కన కూర్చున్నాడు. నొప్పి తగ్గాక మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. స్పృహ కోల్పోయిన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పడికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST