Man Carrying Crocodile Viral Video : మొసలిని భుజాలపై ఎత్తుకున్న 'బాహుబలి'.. 300 మీటర్లు మోసుకెళ్లి.. - లలత్పుర్లో మొసలిని బందించిన గ్రామస్థులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-10-2023/640-480-19831741-thumbnail-16x9-villager-carrying-crocodile-on-shoulder.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Oct 22, 2023, 3:17 PM IST
|Updated : Oct 22, 2023, 4:34 PM IST
Man Carrying Crocodile Viral Video : ఉత్తర్ప్రదేశ్.. లలిత్పుర్ జిల్లాలో ఓ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా ఓ మొసలిని సినీ ఫక్కీలో తన భుజాలపై మోసుకుని వెళ్లాడు. అనంతరం అటవీ శాఖ అధికారులు మొసలిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే
లలిత్పుర్ జిల్లా.. రాజ్వారా అనే గ్రామంలోని చెరువులో మొసలి కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం సోహన్, సంజు అనే వ్యక్తులు సహా ఇతర గ్రామస్థుల సహాయంతో అటవీశాఖ అధికారుల బృందం మొసలిని పట్టుకుని తాళ్లతో బంధించింది. అనంతరం ఓ వ్యక్తి మొసలిని అమాంతం తన భుజాలపై వేసుకుని 300 మీటర్ల దూరంలో ఉన్న అటవీశాఖ వాహనం వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మొసలిని అటవీ శాఖ అధికారులు సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.