Man gets Married to Transgender : ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు.. ఎక్కడంటే! - telangana latest news
🎬 Watch Now: Feature Video
Man gets Married to Transgender in Mahabubabad : పెళ్లి చేసుకోవాలంటే చదువు, అందం, ఉద్యోగం, ఆస్తి, కుటుంబం ఇవన్నీ చూస్తుంటాం. అన్నీ సక్రమంగా ఉంటేనే చేసుకోవడానికి ఇష్టపడతాం. అటు ఏడు తరాలు ఇటు తరాలు అంటూ ఏవేవో నమ్మకాలతో ఉంటాం. సాధారణ ప్రజల సంగతి పక్కన పెడితే.. ట్రాన్స్జెండర్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. వారికి జీవితభాగస్వామి దొరకడం కాస్త కష్టం. వారి మనసు అర్థం చేసుకునే వాళ్లు దొరకడం ఇంకా కష్టం. అయితే ఓ ట్రాన్స్‌జెండర్‌కు మాత్రం తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికాడు. దొరకడమే కాదు తనను వివాహం కూడా చేసుకున్నాడు.
ఓ యువకుడు ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో చోటుచేసుకుంది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన భానోత్ రాధిక (28 )... డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరు (30)లు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ట్రైన్లో మొదలైన వీరి ప్రేమ వ్యవహారం పెళ్లికి దారి తీసింది. పెద్దలకు వారి ప్రేమ గురించి చెప్పి పెళ్లికి ఒప్పించారు. బుధవారం నాడు గార్ల మండలం మర్రిగూడెం లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి పలువురు ట్రాన్స్జెండర్లు హాజరయ్యారు.