Fishes died In Lotus Pond : లోటస్‌పాండ్ చెరువులో భారీగా చేపల మృతి.. కారణమేంటో..? - బంజారాహిల్స్ లోటస్‌పాండ్ చేపలు
🎬 Watch Now: Feature Video
Fishes died In Lotus Pond : బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్ అంటేనే అందమైన చెరువు, చుట్టూ పచ్చని మొక్కలు, చెరువులో పెద్ద ఎత్తున కనిపించే వివిధ రకాల చేపలు, తాబేళ్లు, పక్షులు కనిపిస్తుంటాయి. ఏమైందో ఏమో.. ఎవరేం చేశారో తెలియదు.. గడిచిన నాలుగు రోజులుగా చెరువులోని చేపలు వేలాదిగా మృతి చెందుతున్నాయి. చేపలు విలవిల్లాడుతూ గాల్లోకి ఎగురుతూ మృతి చెందుతున్న వైనాన్ని చూసి నిత్యం పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి మురుగు నీరు పారడం వల్ల అని కొందరు అంటుంటే, చెరువు నీళ్లలో ఎవరో విష ప్రయోగం చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. ఈ చెరువులో చేపలతో పాటు పెద్దఎత్తున తాబేళ్లూ ఉన్నాయి. ఇవి కూడా చనిపోతున్నాయి. సంబంధిత అధికారులు నీటి నమూనాలను సేకరించి పరిశోధన చేస్తున్నారని పార్క్ సిబ్బంది తెలిపారు.
వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. వర్షాలు తగ్గిన తర్వాత కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొంత మంది నివాసితులు తమ సెల్లార్లలో నిండిన వరద నీటిని బయటకు పంపింగ్ చేశారు. ఈ నీరు సైతం చెరువులోకి వచ్చి చేరింది. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న కొంత మంది భవన నిర్మాణదారులు బ్లాస్టింగ్‌లో వినియోగించే కెమికల్ వ్యర్థాలను కూడా ఈ చెరువులోకి పంపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కెమికల్ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని.. వాటి వల్లే చేపలు చనిపోయి ఉంటాయని ఇంకొంత మంది భావిస్తున్నారు.