Viral Video: మేక తలకాయల లోడ్ రోడ్డుపై పడిపోయింది.. ఇంకేముంది క్షణాల్లో... - మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద లారీ బోల్తా
🎬 Watch Now: Feature Video
Medak Viral Video: జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి.. అందులో ఉన్న మేక తలకాయలు, కాళ్లు కింద పడడంతో జనాలు వాటిని తీసుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్‌లోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు మేక కాళ్లు, తలకాయలతో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చి వాటిని తీసుకొని వెళ్లడానికి పోటీపడ్డారు.
హైదరాబాద్‌లో మేక కాళ్లు, తలకాయలకు భారీ డిమాండ్ ఉండడంతో నిత్యం మహారాష్ట్ర నుంచి ఇక్కడకు లారీల ద్వారా తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా తూప్రాన్ వద్దకు వచ్చేసరికి లారీ బోల్తాపడడంతో.. అందులోని ఫ్రిజ్ బాక్స్‌లో ఉన్న మేక తలకాయలు, కాళ్లు రహదారిపై కిందపడ్డాయి. ఒక్కసారిగా అక్కడకు జనం చేరుకొని.. సంచుల్లో వేసుకొని తీసుకెళ్లారు. కొందరైతే లారీలోపల ఉన్న బాక్స్‌లలో ఉన్నవి కూడా తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చేసరికి లారీలో సరకు మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.