Lineman Rescue Pigeon Viral Video : విద్యుత్ తీగపై చిక్కుకుని పావురం అష్టకష్టాలు.. లైన్‌మ్యాన్ రెస్క్యూ ఆపరేషన్‌తో.. - పావురాన్ని కాపాడిన లైన్‌మ్యాన్
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 10:07 AM IST
Lineman Rescue Pigeon Viral Video : విద్యుత్ తీగపై చిక్కుకుని అష్టకష్టాలు పడ్డ పావురాన్ని చాకచక్యంగా కాపాడాడు ఓ లైన్‌మ్యాన్. ఈ సంఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లైన్‌మ్యాన్ రెస్క్యూ ఆపరేషన్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
Pigeon Rescue Video : జిల్లాలోని కడబ నగరంలో శనివారం ఉదయం ఓ పావురం.. విద్యుత్ తీగపై వాలింది. ఆ తర్వాత పక్షి కాలికి ఉన్న ప్లాస్టిక్ తాడు.. విద్యుత్ తీగకు చుట్టుకుంది. దీంతో పావురం ఎగిరేందుకు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. సుమారు గంటన్నరగా వేలాడుతున్న పావురాన్ని గమనించిన స్థానికులు అయ్యో అంటూ ఆవేదన చెందారు. ఇంతలో ఓ వ్యక్తి.. లైన్ మ్యాన్ గురుమూర్తికి సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న వెంటనే లైన్‌మ్యాన్ గురుమూర్తి.. సంఘటనాస్థలికి చేరుకుని విద్యుత్‌ను నిలిపివేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కి పావురాన్ని రక్షించాడు. పావురం కాలికి ఉన్న ప్లాస్టిక్ తాడును తీసేసి ఆకాశంలోకి ఎగురవేశాడు. గురుమూర్తి రెస్క్యూ ఆపరేషన్‌ను స్థానికులు అభినందించారు.