Leopard Wanders in Sangareddy Video Viral : పంట పొలాల్లో చిరుత సంచారం.. వీడియో వైరల్ - సంగారెడ్డిలో చిరుత సంచారం వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
Published : Oct 31, 2023, 2:10 PM IST
Leopard Wanders in Sangareddy Video Viral : ఈ మధ్య కాలంలో అడవుల్లో తిరగాల్సిన చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మంగి గ్రామ శివారులో చిరుత సంచరించింది. చిరుత కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రిపూట పంట పొలాల్లోకి చిరుత రావడాన్ని గమనించిన గ్రామస్థులు .. దాని కదలికలను సెల్ఫోన్లో రికార్డు చేశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. హుటాహుటిన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
చిరుత సంతరించిన పాదముద్రలను పరిశీలించారు. చీకటిగా ఉండడంతో స్పష్టత లేకపోవడంతో.. ఇవాళ మరో మారు సందర్శించి పాదముద్రలను సేకరిస్తున్నట్లు అటవీ క్షేత్ర అధికారి రాధికా రెడ్డి తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎవరూ బయటకు వెళ్లవద్దని.. గుంపులుగా వెళ్లాలని తెలిపారు. చిరుతపై ఎవరైనా దాడులకు దిగితే.. చంపేందుకు ఎవరైనా సిద్ధపడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.