thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 4:01 PM IST

ETV Bharat / Videos

Leopard Trapped in Narayanpet : నారాయణపేట జిల్లాలో బోనులో చిక్కిన చిరుత.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు

Leopard Trapped in Narayanpet : నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామ శివారులో.. ఫారెస్ట్​ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత పులి చిక్కింది. గత కొన్ని రోజులుగా గ్రామ శివారు ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తూ.. పశువులను వేటాడి చంపేస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. 

Leopard Caged in Marikal Mandal Rakonda : గ్రామ శివారు ప్రాంతాల్లో అక్కడక్కడ బోనులు ఏర్పాటు చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. ఎట్టకేలకు చిరుతపులి బోనులో పడటంతో.. చుట్టూ పక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన చిరుతను అచ్చంపేట అటవీ ప్రాంతానికి తరలిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తమకు గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుతపులి.. బోనులో చిక్కినందుకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరుత భయానికి చీకటి పడిందంటే.. పొలాల వద్దకు వెళ్లడం మానేశామన్నారు. పశువులకు ఇంటివద్దే మేత వేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.