Gold Rate Today January 1st, 2025 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,330 ఉండగా, బుధవారం నాటికి రూ.425 పెరిగి రూ.78,755కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.88,011 ఉండగా, బుధవారం నాటికి రూ.88 పెరిగి రూ.88,099కు చేరుకుంది.
- Gold Price In Hyderabad January 1st, 2025 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,755గా ఉంది. కిలో వెండి ధర రూ.88,099గా ఉంది.
- Gold Price In Vijayawada January 1st, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,755గా ఉంది. కిలో వెండి ధర రూ.88,099గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 1st, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,755గా ఉంది. కిలో వెండి ధర రూ.88,099గా ఉంది.
- Gold Price In Proddatur January 1st, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,755గా ఉంది. కిలో వెండి ధర రూ.88,099గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 1st, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2,606 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 18 డాలర్లు పెరిగి 2,624 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.91 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today January 1st, 2025 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్ షేర్లు మాత్రం భారీగా నష్టపోతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తుండడం, యూఎస్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టపోయి 78,102 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 23,626 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : ఏసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, రిలయన్స్, టీసీఎస్
- నష్టాల్లో ఉన్న షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Value January 1st, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.69గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices January 1st, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు
Crude Oil Prices January 1st, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.88 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 74.64 డాలర్లుగా ఉంది.