Bonalu Festival 2023 : 'బోనాల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి' - Narasimha Reddy latest news
🎬 Watch Now: Feature Video
Bonalu Festival in LB Nagar : బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి.. వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి కొత్తపేట జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంకజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం కార్పొరేటర్లతో బోనాల పండుగకు సంబంధించిన ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విడతల వారీగా ఈ పండుగ జరుగుతుందని.. అందువల్ల భద్రతా ఏర్పాట్లు పెంచాలని జోనల్ కమిషనర్‌ను కోరారు. ఆలయాల దగ్గర వసతుల ఏర్పాట్ల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. ఆలయాల పరిధిలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని.. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రహదారుల్లో సీసీ కెమెరాలను, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్యాచ్ వర్క్‌లు చేయాలని సూచించారు. అలాగే పండుగ వైభవంగా జరిగేలా.. ఆకట్టుకునే విధంగా లైటింగ్ ప్రదర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతల అరుణ సురేందర్ యాదవ్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, అధికారి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.