Largest Hindu Temple Outside India : 183 ఎకరాలు.. 10వేల విగ్రహాలు.. 300 నదుల నీళ్లు.. అతిపెద్ద హిందూ దేవాలయం గ్రాండ్ ఓపెన్ - అమెరికాలో అతిపెద్ద హిందూ ఆలయం
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2023, 5:52 PM IST
Largest Hindu Temple Outside India : భారత్ వెలుపల విదేశాల్లో నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభమైంది. న్యూజెర్సీలో నిర్మితమైన ఈ దేవాలయాన్ని అక్టోబరు 8న అధికారికంగా ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ ఆలయానికి ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన హిందువులు, ఇతర మతస్థులు దర్శించుకుంటున్నారు.
2011లో రాబిన్స్‌విల్లే టౌన్షిప్లో ప్రారంభమైన దేవాలయం నిర్మాణం పనులు.. 12ఏళ్ల తర్వాత 2023లో పూర్తయ్యాయి. 183 ఎకరాల్లో అక్షర్‌ధామ్ పేరుతో నిర్మితమైన ఈ ఆలయంలో మొత్తం 10 వేల విగ్రహాలు, శిల్పాలు ఉంటాయని అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని అక్షర్‌ధామ్‌లో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలతో బ్రహ్మకుండ్ అనే సంప్రదాయ బావిని ఏర్పాటు చేశారు. దశాబ్ద కాలంగా సాగిన ఈ ఆలయ నిర్మాణానికి లక్షల మంది వాలంటీర్లు తమ సహాయ సహకారాలు అందజేశారని బీఏపీఎస్ స్వామినారాయణ్ సంస్థకు చెందిన అక్షర్ వత్సల్‌దాస్ స్వామి వెల్లడించారు.