యాదాద్రిలో లక్ష్మీనరసింహ స్వామికి ఘనంగా లక్ష పుష్పార్చన - Ekadashi celebrations at Yadadri temple
🎬 Watch Now: Feature Video
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఆలయంలో నిత్యారాధనలు సంప్రదాయంగా చేపట్టారు. ఏకాదశి సందర్భంగా పూజారుల వేదమంత్రాల నడుమ లక్ష పుష్పార్చన జరిపారు. వేకువజామున సుప్రభాతం.. ఉదయాన నిజాభిషేకం.. మహామండపంలో లక్ష పుష్పార్చనతో యాదాద్రీశుడి సన్నిధి ఆధ్యాత్మిక వేడుకలతో సందడిగా మారింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు, పూజ విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంఛార్జ్ ఈఓ, అధికారులు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు మొక్కులు తీర్చుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
మరోవైపు వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. పదకొండు రోజుల పాటు పాంచారాత్రాగమ విధానాలతో నిర్వహించనున్నారు. అంతే కాకుండా మార్చి1న దివ్యవిమాన రథోత్సవ వేడుక, 2న చక్రతీర్థం, 3న మూలవరులకు విశిష్ట అభిషేకం నిర్వహించనున్నట్లు యాదాద్రి దేవస్థానం తెలిపింది. భక్తులు పై సమాచారం తెలుసుకొని యాదాద్రి దర్శనం చేసుకొగలరని ఆలయ అధికారులు పేర్కొన్నారు.