సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో గందరగోళం - చీరల పంపిణీలో మహిళల వాగ్వాదం
🎬 Watch Now: Feature Video
Published : Dec 9, 2023, 7:56 PM IST
Ladies Fighting for Sarees : సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. హైదరాబాద్ సనత్ నగర్‌లో కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ ఆధ్వర్యంలో చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో చీరల కోసం ఎదురుచూసిన మహిళలు సహనం కోల్పోయారు. చీరలు తక్కువ ఉండి, మహిళలు ఎక్కువ హాజరు కావడంతో గందరగోళం నెలకొంది. చీరలు వస్తాయన్న ఆశతో మధ్యాహ్నం నుంచి వేచి ఉన్న మహిళలకు చివరికి నిరాశే ఎదురయ్యింది. చీరల కోసం మహిళల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.
కార్యక్రమానికి వచ్చిన మహిళలను నియంత్రించడంలో సరైన సమన్వయం లేక కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. అప్పటికే కోట నీలిమ మహిళలకు సర్ది చెబుతూ వారికి చీరలు పంచే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలలో ఆవేశం కట్టలు తెంచుకోవడంతో మహిళల మధ్య గొడవకి దారి తీసింది. పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అయిన కోట నీలిమ చేసేదేమీ లేక చేతులెత్తేసి అక్కడినుంచి జారుకున్నారు. చీరలు పంపిణీ చేసే కాంగ్రెస్ నాయకుల మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ఈ గొడవకు దారితీసింది.