3,782 మంది చిన్నారుల కూచిపూడి నృత్యం - గిన్నిస్ రికార్డు దాసోహం - kuchipudi show in gachobowli stadium
🎬 Watch Now: Feature Video


Published : Dec 24, 2023, 10:45 PM IST
Kuchipudi Show Guinness World Record in Hyderabad : తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహంతో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన కూచిపూడి ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇందుకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం వేదికైంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి సమక్షంలో 3,782 మంది చిన్నారులు కూచిపూడి నృత్యం చేయడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు.
Guinness World Record Kuchipudi Show video : రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇన్నిరోజులు కార్యక్రమాల్లో ఒక్కరిగా ప్రదర్శన ఇవ్వడానికి భిన్నంగా వేల మంది కళాకారులతో కలిసి ఇవ్వడం మరచిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. గిన్నిస్ రికార్డు సాధనలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.