Double Bedroom Housing Community at Kollur : కొల్లూర్‌లో ఆసియాలోనే అతిపెద్ద 2BHK ప్రాజెక్టు.. రేపే ప్రారంభోత్సవం - ktr latest news
🎬 Watch Now: Feature Video
KTR Tweet on Kollur Double Bedroom Housing Project : పేదలకు ఆవాసం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డబుల్ బెడ్ రూం పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో డబుల్ బెడ్ రూమ్ టౌన్‌షిప్‌ను నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద 2బీహెచ్‌కే హౌసింగ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌పై మంత్రి కేటిఆర్ ట్వీట్ చేశారు. 'డేర్ టూ డ్రీమ్న్ దెన్ డిసైడ్ టు డూ (కలలను కనండి.. సాకారం చేసుకోండి)' అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రం అని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన హౌసింగ్ కమ్యూనిటీలో 15 వేల 6 వందల 60 2 బీహెచ్‌కే యూనిట్లు ఉండటం విశేషం. మొత్తం 145 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో యూనిట్‌కు 560 చదరపు అడుగుల పరిమాణంతో....అన్ని సాధారణ సౌకర్యాలు...పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కమ్యూనిటీ అవసరాలతో నిర్మించిన కమ్యూనిటీని జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు.