KTR Playing Football Video Viral : పుట్బాల్ ఆడుతూ గోల్ కొట్టిన కేటీఆర్.. వీడియో వైరల్ - కేటీఆర్ పుట్బాల్ వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 2:07 PM IST
KTR Playing Football Video Viral : ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగానే 20వ వార్డులో ఉన్న పుట్బాల్ టర్ఫ్కోర్టును ప్రారంభించారు. అనంతరం పుట్బాల్ ఆడే చిన్నారులతో ముచ్చటించారు. వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కాసేపు పుట్బాల్ కోర్టులో సరదాగా గడిపారు.
పుట్బాల్ ఆడుతూ.. మొదటి గోల్ కొట్టినప్పుడు గోల్ పోస్టులోకి గోల్ వెళ్లకపోయేసరికి అసహనానికి గురయ్యారు. పక్కనే ఉన్న మంత్రి అజయ్ కుమార్తో మీ వల్లే గోల్ కొట్టలేకపోయాను అంటూ జోక్ చేశారు. వెంటనే మరో గోల్ చేయడానికి సిద్ధమై.. ఈసారి గోల్ గురిచూసి కొట్టారు. మైదానంలో ఆడే క్రీడాకారుల్లాగా.. గోల్ కొట్టగానే ఆనందంతో మురిసిపోయారు. అంతకు ముందు చిన్నారి క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ తాను చిన్నప్పటి నుంచి పుట్బాల్ లెజెండ్ మెస్సీ ఫ్యాన్ అంటూ తనకు క్రీడలపై ఉన్న అభిమానాన్ని చూపించారు.