KTR Comments on Congress Party : 'కాళేశ్వరం వల్లే.. 4 జిల్లాల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోంది'

By ETV Bharat Telangana Team

Published : Oct 25, 2023, 5:15 PM IST

thumbnail

KTR Comments on Congress Party : బీఆర్​ఎస్​ను ప్రజలు తమ ఇంటిపార్టీగా భావిస్తున్నారని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)​ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ సమస్య, నీళ్ల సమస్య పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్‌ జిల్లా అంతా పచ్చగా మారిందని చెప్పారు. నాలుగు జిల్లాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుందని వెల్లడించారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్‌(Congress) మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కర్ణాటకలో కరెంట్‌ లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని ఆరోపించారు. గాడిన పడుతున్న రాష్ట్రాన్ని గద్దలపాలు చేయొద్దని సూచించారు. 

KTR Comments on Karnataka Government : కర్ణాటకలో కాంగ్రెస్​ను గెలిపించినందుకు అప్పుడే అక్కడి ప్రజలు బాధలు పడుతున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ మేనిఫెస్టోను కార్యకర్తలకు వివరించారు. కేసీఆర్​ భరోసా(KCR BAROSA) పేరిట 15 కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామని అన్నారు. గొల్ల, కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీని పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు కేటీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.