కొమురవెల్లిలో నిప్పులపై నడిచిన మల్లన్న భక్తులు - Temples of Telangana
🎬 Watch Now: Feature Video
Komuravelli mallanna temple: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం వైభవంగా జరిగింది. మూడు నెలలుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అగ్నిగుండాల ప్రవేశం చేసి ముగింపు పలికారు. భారీగా తరలివచ్చిన భక్తులు నిప్పులపై నడిచి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అగ్నిగుండం కోసం భూమి పూజ చేశారు. అనంతరం భద్రకాళీ మాత అష్టోత్తర శతనామ పూజ అగ్ని ప్రతిష్ట చేసి కట్టెలు పేర్చి మంటలు అంటించారు. ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటలకు అగ్నిగుండం ఎదుట పూజలు నిర్వహించి చుట్టూ అష్టదిక్పాలకులు భైరవ పూజలు బలిహరణ చేశారు. స్వామివారి చిత్ర ముఖం ఖడ్గాలను ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్పాటు ఇతరులు ముందుగా అగ్నిగుండాను దాటి ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం భక్తులు శివసత్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాల ప్రవేశం చేసేందుకు పోటీపడ్డారు. పోలీసులు ఒక్కొక్కరిని అగ్నిగుండంలోకి అనుమతిచ్చారు. పోతరాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాలు బోనాలు నెత్తిన పెట్టుకొని బారులు తీరిన భక్తజనం రంగుల ముగ్గులతో మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.