Komatireddy Venkat Reddy on Congress MLA Tickets : 'టికెట్లు దక్కని నేతలు ఎన్నికల్లో సహకరించాలి' - ఎమ్మెల్యే టికెట్లపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 4:34 PM IST

Komatireddy Venkat Reddy on Congress MLA Tickets : టికెట్లు రాని వారు పెద్ద మనసుతో టికెట్లు వచ్చిన వారికి సహకరించాలని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,  ప్రచారకమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి(Komatireddy Venkat Reddy) విజ్ఞప్తి చేశారు. తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరవేయాలని నేతలుకు సూచించారు. నీడను ఇచ్చిన చెట్టును నరుక్కోవడం సరికాదంటూ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పొన్నాలకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గుర్తింపునిచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు. ఆయన పార్టీ మారడం బాధాకరమని చెప్పారు. టికెట్‌ రానంత మాత్రాన కాంగ్రెస్​ని పొన్నాల నిందించడం తగదన్నారు. 

వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు.. కాంగ్రెస్‌కు కొంత నష్టమేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రి కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్నారన్న ఆయన.. బీఆర్ఎస్​ మేనిఫెస్టో(BRS Manifesto 2023)ను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌(Congress) అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.