ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నిన్ను సీఎంని చేయరు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఆన్ హరీశ్
🎬 Watch Now: Feature Video
Published : Dec 20, 2023, 3:59 PM IST
Komatireddy Rajagopal Reddy Comments on Harish Rao : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత బాగా పనిచేసినా హరీశ్‌కు మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని వ్యాఖ్యానించారు.
Komatireddy Rajagopal Reddy vs Harish Rao : అసెంబ్లీలో ఎంత గట్టిగా మాట్లాడినా మంత్రి పదవి రాదని హరీశ్ రావు తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. దీనికి బదులుగా ఆయన కేసీఆర్ తరువాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సీఎం అవుతారే తప్పా హరీశ్ ఎంత కష్టపడి పనిచేసినా సీఎంని చేయరని ఎద్దేవా చేశారు. తండ్రి, కుమారులు హరీశ్‌ను వాడుకుంటారే తప్పా, న్యాయం చేయరని తెలిపారు. తన మంత్రి పదవి గురించి కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తుందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.