Kishan Reddy Visits Khairatabad Ganesh : 'హిందూ సమాజాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి' - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Sep 27, 2023, 5:45 PM IST
|Updated : Sep 27, 2023, 5:51 PM IST
Kishan Reddy Visits Khairatabad Ganesh : ప్రపంచ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navratri Celebrations) ఘనంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాల కారణంగానే హిందువుల్లో ఐక్యత వచ్చిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశ్(Khairatabad Ganesh)ను దర్శించుకున్న కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kishan Reddy on Ganesh Navratri Celebrations : ఖైరతాబాద్ ఉత్సవ సమితి, భాగ్యనగర్ ఉత్సవ సమితి కృషి వల్లే దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు చూసేందుకు భక్తులు ఇక్కడికి వస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. స్వర్గీయ నరేంద్ర, శంకరయ్య, సుదర్శన్ ఆత్మకు శాంతి చేకూరాలని గణేశ్‌ను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో 'మనమంతా హిందువులం.. దేశ బంధువులం' అనే విధంగా ఐక్యంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో హిందూ సమాజాన్ని దెబ్బతీసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ సమాజాన్ని చైతన్యం చేసే దిశగా మనమంతా కృషి చేయాలని కోరారు.