15 రోజుల్లో అనంతగిరి పర్యాటక కేంద్రంలో రూ.100 కోట్ల పనులు : కిషన్ రెడ్డి - Kishan Reddy Boating Video
🎬 Watch Now: Feature Video
Published : Jan 15, 2024, 7:15 PM IST
|Updated : Jan 15, 2024, 7:36 PM IST
Kishan Reddy on Tourism Development in Telangana : దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వడానికి ప్రైవేట్ పెట్టుబడులు రావాలని కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించామని ప్రైవేట్ రంగాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బహుళజాతి కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావాలని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తున్నాయని తెలిపారు. భారత్‌లో ఈ రంగానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లిని కిషన్ రెడ్డి సందర్శించారు.
Kishan Reddy at Ananta Padmanabha Swamy Temple : వికారాబాద్ అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించి స్వామివారి చిత్ర పటాన్ని అందించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆలయ అధికారులు వినతి పత్రం అందజేశారు. అనంతరం 15 రోజుల్లో రూ.100 కోట్లకు సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తరవాత అనంతగిరి హిల్స్ వద్ద ఉన్న కోటపల్లి ప్రాజెక్ట్‌లో బోటింగ్ చేశారు.