కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదు : కిషన్ రెడ్డి - CM Revanth Reddy
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-01-2024/640-480-20427896-thumbnail-16x9-kishan.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 4, 2024, 3:33 PM IST
Kishan Reddy Comments on CM Revanth Reddy : కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదు : కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఎంపీ హోదాలో సీబీఐకి వివరాలు ఇస్తానని రేవంత్ అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం హోదాలో కాళేశ్వరంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్‌ను కాంగ్రెస్ రక్షిస్తోందన్నారు. కేసీఆర్‌కు తాను కాదు, కాంగ్రెస్ పార్టీనే బినామీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆవేదన చెందారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్థానం ఎలా మొదలైందో ప్రజలకు తెలుసునని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం ఆదాయం, తన ఆదాయంపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
Central Minister Kishan Reddy on Kaleshwaram Project : కాళేశ్వరంలో బీజేపీకు వాటా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, వాటిని నిరూపించాలని కాంగ్రెస్ నేతలను కోరారు. లంకెబిందెలు కోసమే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారా అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.