కోలుకుంటున్న కేసీఆర్ - చేతికర్ర సాయంతో నడక - Kcr Latest News
🎬 Watch Now: Feature Video
Published : Jan 17, 2024, 8:18 PM IST
KCR Walking Video Viral : శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. చేతికర్ర సాయంతో నడవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో కర్ర సాయంతో నడుస్తున్నారు. కేసీఆర్ నడుస్తున్న వీడియోను రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ధృడసంకల్పంతో ప్రతి అడుగుతో కేసీఆర్ బలాన్ని తిరిగి పొందుతున్నారని పేర్కొన్నారు. త్వరలోనే సాఫీగా నడిచి అందరి ముందుకు వస్తారని సంతోష్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
KCR Heatlh Details Today : కేసీఆర్(KCR Walking) వీడియోను చూసి ఆయన అభిమానులు ది ఫైటర్, గెట్ వెల్ సూన్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయన గత సంవత్సరం కాలికి దెబ్బతగలడంతో యశోద ఆస్పత్రిలో ఎడమతుంటి మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయింది. దీంతో ఆయనను కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇవాళ వైద్యులు తోడు ఉండగా కేసీఆర్ నడవడం మొదలు పెట్టారు.