కీలక దశకు ఎన్నికల ప్రచారం - కేసీఆర్, రేవంత్‌ల మధ్య మాటల యుద్ధం - కేసీఆర్ కామెంట్స్ ఆన్ రేవంత్ రెడ్డి
🎬 Watch Now: Feature Video
Published : Nov 21, 2023, 6:45 AM IST
KCR VS Revanth Reddy in Election Campaign : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ .. ప్రచారం మరింత రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంపై కేసీఆర్ విమర్శలు చేస్తే.. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై రేవంత్ దీటుగా బదులు ఇస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పాలన సరిగా జరగలేదని కేసీఆర్ ఆరోపిస్తే.. గత తొమ్మిది సంవత్సరాల్లో అవినీతి ఎక్కువ జరిగిందని రేవంత్ ఆరోపిస్తున్నారు.
Telangana Election Campaign 2023 : ఇరు పార్టీ నాయకులు పాలన వైఫల్యాలపై పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి(REVANTH REDDY) రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ తమ మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. తమ నాయకుల్లో జోష్ నింపుతును ముందుకు సాగుతున్నారు.