నేను బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు : కేసీఆర్ - రైతు బంధు నిధుల విడుదలపై సీఎం కేసీఆర్ స్పందన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 5:34 PM IST

KCR Praja Ashirvada Sabha at Andole : ప్రాజెక్టుల ద్వారా పన్ను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, చేవెళ్లలో పర్యటించిన అనంతరం సంగారెడ్డి జిల్లా ఆందోల్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు. 5 ఏళ్లకు వచ్చే ఎన్నికలను ఆషామాషాగా తీసుకోకూడదని.. ప్రజలు ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు తలరాతను మార్చే ఆయుధంగా అభివర్ణించారు. రైతు బంధుపై నిలిపివేతపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకే.. రైతుబంధును ఈసీ మళ్లీ ఆపేసిందని ఆరోపించారు.

ఏదేమైనా డిసెంబర్ 03న అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని.. వెను వెంటనే రైతుబంధు నిధులు జమ చేస్తామని తెలిపారు. తాను బతికున్నంత వరకు రైతుబంధు ఆగదని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఆందోల్‌ నియోజకవర్గానికి ఒకే విడతలో దళితబంధు ఇస్తానన్న ఆయన.. పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని మరీ నియోజకవర్గ దళిత వాడల నుంచి దరిద్రాన్ని పారద్రోలుతానని అన్నారు. కరెంట్ వాడకంపై కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను తిప్పుకొడుతూ.. నాటి చీకటి రాత్రులు మళ్లీ అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో కనీసం సింగూరు నీళ్లు రాలేదని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.