'కాంగ్రెస్ గ్యారెంటీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దు - కర్ణాటకలో ఆ పార్టీ దివాళా దిశగా నడుస్తోంది' - బీజేపీ ఎన్నికల ప్రచారం 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 3:26 PM IST
Karnataka Ex CM Yediyurappa Campaign in Telangana : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోవద్దని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని యడియూరప్ప వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు అమలు కావడంలేదన్నారు.
BJP Election Campaign 2023 : కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య సర్కారు దివాలా దిశగా నడుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలనీ అబద్దపు హామీలతో కర్ణాటక ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ఆ పార్టీ సరికొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.