సీతారామ ప్రాజెక్టుతో పాలేరుకు గోదావరి నీళ్లు అందిస్తా : కందాల ఉపేందర్ రెడ్డి - పాలేరు BRS అభ్యర్థి పాలేరు
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 2:11 PM IST
Kandala Upender Reddy Interview : హేమాహేమీలు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నా.. ఈసారీ ప్రజా ఆశీర్వాదంతో పాలేరులో విజయబావుటా ఎగురవేయడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలే ఎన్నికల్లో ప్రధాన నినాదంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్న కందాల.. నియోజవర్గ ప్రజలతో తనకున్న అనుబంధం మరే ఇతర నాయకులకు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పాలేరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్నానని తెలిపారు.
Kandala Upender Reddy On Paleru Development : కేసీఆర్ చేస్తున్న అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉపేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నుంచి పొంగులేటి, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ పడినా.. ప్రజలు తమవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఐటీ దాడుల పేరుతో పొంగులేటి సానుభూతి పొందేలా చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దళిత బంధు చెక్కుల పంపిణీ.. ఎన్నికల్లో భాగం కాదని.. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇచ్చానని వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టుతో పాలేరుకు గోదావరి నీళ్లు అందించి తీరుతామంటున్న.. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డితో ముఖాముఖి.