Kamareddy Rains : భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు.. నిజాంసాగర్లోకి పోటెత్తుతున్న వరద
🎬 Watch Now: Feature Video
Nizam sagar project Water Level : కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీ వరద చేరి నిండుకుండల్లా మారుతున్నాయి. ముఖ్యంగా నిజాంసాగర్ జలాశయంలోకి భారీ వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 45 క్యూసెక్కుల నీరు రావడంతో ఐదు గేట్లు ఎత్తి 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 1404.58 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు, ప్రస్తుతం నీటి సామర్థ్యం 17.195 టీఎంసీలు నిల్వ ఉంది. మరోవైపు
జిల్లాలోని జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 2454 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు లోకి ఎగువ కర్ణాటక నుంచి 2454 క్యూసెక్కుల నీరు వస్తుంది.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు, ప్రస్తుత నీటి మట్టం 457.20 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.237 టీఎంసీలు, ప్రస్తుతం నీటి సామర్థ్యం నిల్వ 1.049 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.