పళ్లతో 165 కిలోల బరువును ఎత్తిన జవాన్.. గిన్నిస్ సహా 9 ప్రపంచ రికార్డులు కైవసం
🎬 Watch Now: Feature Video
బిహార్ కైమూర్‌కు చెందిన ధర్మేంద్ర కుమార్ అరుదైన ఫీట్ చేశారు. 165 కిలోల బరువును పళ్లతో ఎత్తి రికార్డు సృష్టించారు. సుమారు 10 సెకన్ల పాటు 165 కిలోల బరువును గాలిలోకి ఎత్తారు. ఆయన ఇప్పటివరకు గిన్నిస్ బుక్ సహా 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. హ్యామర్ హెడ్మాన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందారు ధర్మేంద్ర. ఆయన ఇటీవలే బైక్‌ను భుజాలపై ఎత్తుకుని 100 మీటర్ల దూరం పరిగెత్తారు. అంతకుముందు తలతో కొబ్బరికాయలు పగలకొట్టడం, పళ్లతో ఇనుమును వంచడం లాంటి ఫీట్లు చేశారు.
"బంగాల్ నుంచి వచ్చిన ప్రజలు పళ్లతో 165 కిలోల బరువు ఎత్తాలని నాకు సవాల్ విసిరారు. నేను దానిని స్వీకరించాను. 165 కిలోల బరువును ఎత్తి.. నేతాజీ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాను. మీ అందరి ఆశీస్సుల వల్లే ఈ రికార్డు సాధించగలిగాను. మీ ఆశీస్సులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సాధిస్తాను."అని చెప్పారు ధర్మేంద్ర. కైమూర్ జిల్లాలోని రామ్‌గఢ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం త్రిపుర రైఫిల్స్‌లో జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.